రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ కమిటీలకు నూతన అధ్యక్షుల నియామకం
సిరిసిల్ల, జూలై 2 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతంలో భాగంగా సిరిసిల్ల పట్టణ, ముస్తాబాద్, తంగళ్ళపల్లి కమిటీలకు నూతన అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం నియమించింది. సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సూర దేవరాజు, ముస్తాబాద్ మండల అధ్యక్షుడిగా గజ్జెల రాజు, తంగళ్ళపల్లి మండల అధ్యక్షుడిగా మునిగేల రాజు బాధ్యతలు చేపట్టనున్నారు.
నూతన అధ్యక్షులు తమపై విశ్వాసం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ అగ్రనాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీని గ్రామస్థాయి వరకు మరింత బలోపేతం చేస్తూ, నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకొని ప్రజల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతంగా తీసుకెళ్తామని పేర్కొన్నారు. వారి నియామకంపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.






