12 July, 2026 | 5:37 PM

Breaking News

పెద్దమ్మ తల్లి బోనాల మహోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణరావు   •   వనదుర్గమ్మకు భక్తుల తీరొక్క మొక్కులు   •   నూతన ఎస్సీ సెల్ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే పాయం   •   సర్పంచుల శిక్షణకు ఎంపికైన పాట్నాపూర్ సర్పంచ్   •   జాతీయ కిక్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీలకు ధర్మపురి క్రీడాకారుడు ఎంపిక   •   వర్షాలు సమృద్ధిగా కురవాలని జెట్టక్కను తరిమికొట్టిన గ్రామస్తులు   •   పదవి విరమణ పొందిన ఉపాధ్యాయునికి ఘన సన్మానం   •   ఎస్ఐఆర్ ఎన్యుమరేషన్ ప్రక్రియను పరిశీలించిన మార్కెట్ కమిటీ చైర్మన్   •   ప్రజలకు మరింత, పారదర్శకమైన పోలీస్ సేవలు   •   జగన్నాథ రథయాత్రను విజయవంతం చేద్దాం   •  

విద్యార్థులు గ్రామీణ అభివృద్ధి మధ్య వారధిగా మారాలి

19-12-2025 10:07 PM

ఘట్ కేసర్,(విజయక్రాంతి): జిహెచ్ఎంసి ఘట్ కేసర్ సర్కిల్ కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో ఉన్నత భారత్ అభియాన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈకార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన  ప్రాంతీయ సమన్వయకర్త ఉన్నత భారత్ అభియాన్ డాక్టర్ దేబేంద్ర నాథ్ దాస్ మాట్లాడుతూ... విద్యార్థులు, గ్రామీణ ప్రజలు, అభివృద్ధి మధ్య వారధిగా మారాలని సూచించారు.

గ్రామీణాభివృద్ధికి జ్ఞానం, నైపుణ్యాల అభివృద్ధి వాటి అమలు (ఎగ్జిక్యూషన్) ఎంతో కీలకమని అన్నారు. అలాగే నైపుణ్యాల వృద్ధి (స్కిల్ ఎన్‌రిచ్‌మెంట్) ద్వారా గ్రామీణ సమస్యలకు పరిష్కారాలు సాధ్యమని, ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో యువత పాత్ర ఎంతో ముఖ్యమని వివరించారు.