22 May, 2026 | 10:49 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

యానాంలో అగ్నిప్రమాదం.. ఎగసిపడిన మంటలు

22-08-2025 08:41 AM

అమరావతి: యానాం సమీపంలో దరియాలతిప్ప వద్ద అగ్నిప్రమాదం సంభవించింది. ఐలాండ్-3 వద్ద ఓఎన్ జీసీ గ్యాస్ పైప్ లైన్(ONGC gas pipeline) లీకై భారీగా మంటలు  చెలరేగాయి. సముద్రంలోని గ్యాస్‌ ఉత్పత్తి కేంద్రంలో సరఫరా నిలిపివేయడంతో శుక్రవారం తెల్లవారుజామున మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు వెల్లడించారు. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఏమీ కాకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పిందని సిబ్బంది పేర్కొన్నారు.