30 June, 2026 | 1:37 AM

విద్య అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

30-06-2026 12:39 AM

హైదరాబాద్ మాడ్యులస్ కళాశాలకు విద్యార్థులను పంపిన ఐటీడీఏ పీవో

ఉట్నూర్, జూన్ 29 (విజయక్రాంతి) : గిరివిద్య కార్యక్రమంలో భాగంగా గిరిజన విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య... ఉద్యోగ శిక్షణ అవకాశాలను  సద్వినియోగం చేసుకోవా లని ఉట్నూర్ ఐటీడీఏ పీవో మంద మకరందు సూచించారు. సోమవారం గిరివిద్య కార్యక్రమంలో భాగంగా గిరివిద్య  ప్రోగ్రాంలో  ఆశ్రమ గురుకులల్లో చదువుతూ...  ఉచిత ఐఐటి, జేఈ కోచింగ్ కు ఎంపికైన విద్యార్థులను హైదరాబాద్ లోని మాడ్యులస్ కళాశాలకు పంపించారు. 

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐటీడీఏ పీవో మాట్లాడుతూ... క్రమశిక్షణ, కష్టపడి చదవడం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు. గిరివిద్య కార్యక్రమం ద్వారా గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, పోటీ పరీక్షలకు మెరుగైన శిక్షణ అందించి ఉన్నత విద్యా అవకాశాలను కల్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. విద్యార్థులందరూ విద్యాభ్యాసంలో రాణించి తమ కుటుంబానికి, సమాజానికి, ఐటిడిఏ కు మంచి పేరు తీసుకురావాలని ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో ఐటిడిఏ డిడి ప్రేమకళ,  పివిటిజి ఏపీఓ ఆత్రం భాస్కర్, డిప్యూటీ డిఈఓ చందన్, ఏసీఎంఓ జగన్ పాల్గొన్నారు.