21 July, 2026 | 6:35 PM

ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు దాడి చాలా బాధాకరం

21-07-2026 01:14 PM

తీవ్రంగా ఖండించిన ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు 

నేలకొండపల్లి, (విజయక్రాంతి): నీట్ పేపర్ లీకేజీ(NEET paper leak) పై దేశవ్యాప్తంగా విద్యార్థులు యువకులు చేపట్టే ఉద్యమంలో భాగంగా ఢిల్లీలో శాంతితంగా నిరసన చేపడుతున్న విద్యార్థులపై లాటిఛార్జ్ చేయడం పట్ల ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బచ్చలకూరి నాగరాజు తీవ్రంగా ఖండించారు...లాటి దెబ్బలతో విద్యార్థులు ఉద్యమాన్ని ఆపలేరు..ప్రశ్నిస్తున్న యువతపై దాడులు బీజేపీ భయానికి నిదర్శనం అని అన్నారు..కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు..విద్యార్థుల సమస్యలను పరిష్కరించే వరకు కాంగ్రెస్ పార్టీ  విద్యార్థులకు అండగా నిలుస్తుందని తెలియజేశారు... నీట్ పేపర్ లీకేజ్ పై సరైన దర్యాప్తు చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు...