21 July, 2026 | 7:01 PM

కోదాడ పోలీస్ స్పెషల్ ఫోకస్.. బుల్లెట్ బైక్ ల సైలెన్సర్ల ధ్వంసం

21-07-2026 02:39 PM

కోదాడ,(విజయ క్రాంతి): నిబంధనలకు విరుద్ధంగా బైకుల సైలెన్సర్లు మార్చి అధిక శబ్దాలతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్న వాహనాలపై కోదాడ పట్టణ, కోదాడ ట్రాఫిక్ పోలీసులు కట్టిన చర్యలు తీసుకున్నారు. బుల్లెట్ బైక్ సీజ్ చేసిన 40 మేడిఫైడ్ సైలెన్సర్లను మంగళవారం పోలీసులు రోడ్డు రోలర్ తో తొక్కించి ధ్వంసం చేశారు. కోదాడ పట్టణంలోని రంగ థియేటర్ చౌరస్తాలో జిల్లా ఎస్పీ నరసింహ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..మితిమీరిన శబ్దాలు చేస్తూ ప్రజలకు ముఖ్యంగా వృద్ధులు, రోగులు, చిన్న పిల్లలకు ఇబ్బంది కలిగిస్తే చటపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ శివశంకర్, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.