గండిపేట చెరువులో ఒకరు మృతి
రాజేంద్రనగర్ మార్చి 22 (విజయక్రాంతి) : గండిపేట చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి ఓ వ్యక్తి మృతి చెందినట్లు నార్సింగి ఎస్‌హెచ్‌ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు. శనివారం సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి మండలం మహారాజ్పేట్ గ్రామం, రైతు అయిన చెవ్వల్ల శ్రీనివాసులు గండిపేట చెరువులో స్నానం చేసేందుకు వెళ్లి గల్లంతయ్యా డని మృతుని సోదరుడు చెవ్వల నర్సిములు రాత్రి 8 గంటల సమయంలో నార్సింగి పిఎస్ లో ఫిర్యాదు చేశాడు.
నరసింహులు ఫిర్యాదు ఆధారంగా, శనివారం మధ్యా హ్నం సుమారు 3 గంటల సమయంలో తన తల్లి అంథమ్మ మరియు తన తమ్ముడు శ్రీనివాసులు గండిపేట చెరువు కు స్నానం చేయడానికి వెళ్లారు. మొదట అంథమ్మ సరస్సులో స్నానం చేసి సురక్షితంగా బయటకు వచ్చి బట్టలు మార్చుకునేందుకు వెళ్లారు. అనంతరం శ్రీనివాసులు సరస్సులోకి స్నానం చేసేందుకు వెళ్లి తిరిగి బయటకు రాలేదు.
ఫిర్యాదు అందుకున్న వెంటనే కేసు నమోదు చేసిన పోలీసులు గల్లంతైన వ్యక్తిని గుర్తించేందుకు తక్షణమే గాలింపు చర్యలు చేపట్టారు. మొదట్లో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో రాష్ట్ర విపత్తు స్పందన దళం డిఆర్‌ఫ్‌కు సమాచారం అందించారు.
ఆదివారం ఉదయం డిఆర్‌ఫ్ బృందం సం ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టి, చెవ్వల్ల శ్రీనివాస్ మృతదేహాన్ని సరస్సు నీటిలో నుండి క వెలికి తీశారు. మృతదేహనికి శవపంచనామా నిర్వహించి, పోస్టుమా ర్టం పరీక్ష నిమిత్తం ఉస్మానియా మార్ట్యురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు ఎస్ హెచ్ ఓ హరికృష్ణ రెడ్డి తెలిపారు.




