23 March, 2026 | 12:25 PM

కాంగ్రెస్‌లో పదవుల లొల్లి

23-03-2026 12:00 AM

జిల్లా కమిటీ ప్రకటనపై అసంతృప్తుల వెల్లువ

ఇప్పటికే ఇద్దరి రాజీనామా 

పెండింగ్ లోనే మండల అధ్యక్షుల ఎంపిక 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమవుతున్నాయి. ఇటీవల తెలంగాణ ప్రదేశ్ కాం గ్రెస్ కమిటీ ఆమోదంతో 54 మంది సభ్యులతో కొత్త జిల్లా కమిటీని ప్రకటించిన విష యం తెలిసిందే. అయితే ఈ కమిటీ ప్రకటన తర్వాత పార్టీ సీనియర్ నాయకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లా కమిటీలో పద వులు దక్కని పలువురు నాయకులు, కార్యకర్తలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మరికొం దరు తమకు కమిటీలో సముచిత స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా పనిచేసినా తమను పక్కన పెట్టారని ఆరోపణలు చేస్తున్నారు.

ఇద్దరు నేతల రాజీనామా

ఇప్పటికే జిల్లా కమిటీలో అవకాశం దక్కిన ఇద్దరు నేతలు తమ పదవులకు రాజీనామా చేశారు. కెరమెరి ప్రాంతానికి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, సీనియర్ నాయకుడు మునీర్, ఆసిఫాబాద్కు చెందిన రాపర్తి మురళి జిల్లా కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవులకు రాజీనామా చేశారు. ఇదే బాటలో మరికొందరు కూడా రాజీనామాలకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.

కొలిక్కిరాని మండల అధ్యక్షుల ఎంపిక..

జిల్లాలో 15 మండలాలు ఉండగా ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుల ఎంపిక కూడా ఇంకా పూర్తిస్థాయిలో కొలిక్కి రాలేదు. పలు మండలాల్లో అధ్యక్ష పదవుల కోసం పలువురు నాయకులు పోటీ పడుతున్నారు. దీంతో పదవుల కేటాయింపు పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలో మండల అధ్యక్షు ల కేటాయింపుల్లో పెద్దగా ఒత్తిడి లేనట్లు తెలుస్తుంది.

ఎమ్మెల్సీ దండే విఠల్ ఆ నియోజకవర్గంలో నాకు నిత్యం వస్తుండడంతో పార్టీ మండల అధ్యక్ష పదవుల కేటాయింపుల్లో స్థానిక నాయకుల అభిప్రాయంతో ముందుకు వెళుతున్నట్లు తెలుస్తుంది. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో డిసిసి అధ్యక్షురా లు ఆత్రం సుగుణ, నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీర శ్యామ్ నాయక్, మాజీ డిసిసి అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ రావు, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. దీంతో మండల అధ్యక్షులు కేటా యింపులోనూ పెద్ద తలనొప్పిగా మారినట్లుగా విశ్వసనీయ సమాచారం. తమ వర్గా నికి చెందిన వారికే కేటాయించాలని డిసిసిపై పలువురు నాయకులు ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది.

వర్గపోరు కారణమా?

పార్టీలో ఉన్న వర్గపోరే ఈ పరిస్థితికి ప్ర ధాన కారణమని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. పెద్ద నాయకులు పైకి ఒకటిగా కనిపించినప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం తమ అనుచరులకు పదవులు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. దీం తో ఇతర వర్గాలకు చెందిన నాయకుల్లో అ సంతృప్తి మరింత పెరుగుతోంది.ఇలా అంతర్గత విభేదాలు కొనసాగితే భవిష్యత్తులో పార్టీకి ఇబ్బందులు తలెత్తే అవ కాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. విభేదాలను సర్దుబాటు చేయడానికి పార్టీ అధిష్టా నం ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు అవి మాత్రం ఫలించడం లేదని తెలుస్తుంది.