2 July, 2026 | 12:57 PM

Breaking News

యథావిధిగా చమురు సరఫరా

02-07-2026 12:00 AM
  1. నియంత్రణను ఉపసంహరించుకున్న కేంద్రం
  2. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 

హైదరాబాద్, జూలై 1 (విజయక్రాంతి): పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన మార్కెట్లలో అనిశ్చితి నెలకొనడంతో సామాన్య వినియోగదారులకు పెట్రోల్, డీజిల్ కొరత లేకుండా, ధరల భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన తాత్కాలిక నియంత్ర ణను ఉపసంహరించుకుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

ఇప్పుడు పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి చేరుకోవడంతో బుధవారం (1వ తేదీ) నుంచి నియంత్రణలను ఉపసంహరించుకున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. పెట్రోల్ బంకులలో ఒక్కరికి, వాహనానికి రోజుకు గరిష్ఠంగా 200 లీటర్ల హైస్పీడ్ డీజిల్ మాత్రమే సరఫరా చేసే పరిమితిని ఎత్తేసిందన్నారు.

ఇండస్ట్రియల్, ఇనిస్టిట్యూషనల్, కమర్షియల్ వినియోగదారులు రిటై ల్ బంకుల నుంచి కాకుండా, వారి కోసం కేటాయించిన ప్రత్యేక వినియోగదారుల పంపుల ద్వారానే ఇంధనాన్ని కొనుగోలు చేయాలన్న నిబంధనను కూడా తొలగించిందన్నారు. అదే సమయంలో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.183 వరకు తగ్గించి, చిన్న వ్యాపారులు, హోటళ్లు, రెస్టారెంట్లకు గణనీయమైన ఊరటనిచ్చిందని పేర్కొన్నారు.