26 April, 2026 | 6:03 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

ఎన్నికలలో సమన్వయంతో అధికారులు పనిచేయాలి

22-11-2025 12:00 AM

కలెక్టర్ ఆశీష్ సంగు వాన్

కామారెడ్డి, నవంబర్ 21 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ రెండవ సాధారణ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సం గువాన్ తెలిపారు. గ్రామ పంచాయతీ 2వ సాధారణ ఎన్నికలు %--% 2025 కోసం జిల్లాలోని వివిధ ఎన్నికల కార్యకలాపాలకు నోడల్ అధికారులను నియమించారు. ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుతంగా నిర్వహించేందుకు శిక్షణ, రవాణా, భద్రత, మౌలిక వసతులు, కమ్యూనికేషన్, వ్యయ పర్యవేక్షణ వంటి కీలక విభాగాలకు సంబంధిత అధికారులు నోడల్ అధికారులుగా నియమించినట్లు తెలిపారు.

అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఎన్నికల ఏర్పాట్లు సమయానికి పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, అదనపు కలెక్టర్లు విక్టర్, మదన్ మోహన్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, సీఈఓ చందర్ నాయక్, డిప్యూటి ట్రైనీ కలెక్టర్ రవితేజ లతో కలసి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్ స్టేషన్ల ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, తాగునీరు, విద్యుత్, ర్యాంపులు  ఇతర సౌకర్యాలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈకార్యక్రమంలో జిల్లా పంచాయితీ అధికారి, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.