26 April, 2026 | 7:45 PM

Breaking News

కార్యకర్త కుటుంబానికి ఆర్థిక సాయం అందించిన జిల్లా అధ్యక్షురాలు పద్మ దేవేందర్ రెడ్డి   •   శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేసిన మాజీ ఎమ్మెల్యే కందాళ   •   ఘనంగా వాసవి మాత జయంతి వేడుకలు   •   నిరుద్యోగ సమస్యలను పరిష్కారించటంలో కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు విఫలం   •   కొత్త కలెక్టర్ కు స్వాగతం   •   ఖాకీలపై నాయీల నిరసనల వెల్లువ   •   శ్రీ వాసవి మాత అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలి   •   డీజిల్ పెట్రోల్ కొరత లేకుండా చూడాలి: సిపిఐ డిమాండ్   •   ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వీక్షించిన బిజెపి నేతలు   •   ఖానాపూర్ మున్సిపాలిటీకి ఉపాధి పనులు పునరుద్ధరించండి   •  

మెడినోవాలో అరుదైన శస్త్ర చికిత్స

22-11-2025 12:00 AM

మేడ్చల్ అర్బన్, నవంబర్ 21(విజయ క్రాంతి): మేడ్చల్ లో మెడిసిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మెడినోవా ఆసుపత్రిలో ఒక మహిళకు గుండెకు సంబంధించి అరుదైన శస్త్ర చేశారు. వరంగల్ కు చెందిన ఒక మహిళ మానసిక ఆరోగ్యంతో పాటు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుండడంతో స్థానిక వైద్యులు హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు.

బంధువులు ఆ మహిళను మేడ్చల్ లోని మెడినోవ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్ జగదీశ్ రెడ్డి మహిళకు పుట్టినప్పటి నుండి గుండెలో రంద్రం ఉన్నట్లు గుర్తించారు. మహిళ మానసిక స్థితిని దృష్టిలో పెట్టుకొని కార్డియాలజీ వైద్య నిపుణులు అత్యాధునిక ఐమేజింగ్ క్యాథటర్ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని గుండెలో ఉన్న రంద్రాన్ని మూసివేశారు.