13 July, 2026 | 9:54 PM

Breaking News

తప్పకుండా ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకోవాలి   •   33/11 కెవి అచ్చంపేట సబ్ స్టేషన్ లో ఫైవ్ ఎంవిఏ ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించిన ఎస్ఇ శాలియా నాయక్   •   నిరుపేద విద్యార్థినికి రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేత   •   డంపింగ్ యార్డ్ తరలింపుకై జరుగుతున్న పాదయాత్రలను జయప్రదం చేయండి   •   నులిపురుగులను నిర్మూలిద్దాం... ఆరోగ్యాన్ని కాపాడుకుందాం   •   ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •  

కూడలి సుందరీకరణపై అధికారుల పరిశీలన

18-04-2026 12:41 AM

కల్వకుర్తి ఏప్రిల్ 17: పట్టణంలోని పాలమూరు చౌరస్తా సుందరీకరణ పనులపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన నిర్వహించారు. ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో శుక్రవారం మున్సిపల్, పోలీస్, జాతీయ రహదారి శాఖల అధికారులు సంయుక్తంగా సందర్శించారు.ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చౌరస్తాలో సర్కిల్ నిర్మాణాన్ని ఎలా చేపట్టాలనే అంశంపై సమాలోచనలు చేశారు.

పాలమూరు చౌరస్తా నుండి శివాజీ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణతో పాటు ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. చౌరస్తాలో సర్కిల్ నిర్మాణం పూర్తయితే పట్టణానికి మరింత అందం పెరుగుతుందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ షాన్ వాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, డీఎస్పీ వెంకట్ రెడ్డి, ఎన్హెచ్ అధికారి సుమిత్, సీఐ నాగార్జున, కమీష్కరం మహమూద్ షేక్ దితరులు పాల్గొన్నారు.