అధికారికంగా వాసవీమాత జయంతి, వర్ధంతి
- అసెంబ్లీ సమావేశాల్లోగా నిర్ణయం
- ఆర్యవైశ్యులకు సముచిత ప్రాధాన్యం ఇస్తాం
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
- శ్రీవాసవీ మహాశక్తి మహోత్సవం విజయవంతం
- వాసవీ పారాయణానికి గిన్నీస్ రికార్డు
ముషీరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): వాసవీ కన్యకా పరమేశ్వరి మాత ఆత్మార్పణ, జయంతి దినోత్సవాలను అధికారికంగా నిర్వహించే విషయంలో అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోగానే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రక టించారు. ఆదివారం హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన శ్రీ వాసవీ మహాశక్తి మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆర్యవైశ్య సామాజికవర్గానికి తమ ప్రభుత్వంలో సముచిత గౌర వం ఉంటుందని తెలిపారు. వైశ్యులు ఊరికొకరు ఉన్నా ఊరందరూ వారితో ఉంటార న్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వారి సహకారంతోనే రైతులు వ్యవసాయం చేసుకుంటా రన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వారు వెన్నెముకగా నిలుస్తున్నారని చెప్పారు. రాష్ట్ర నిర్మాణంలో వైశ్యులది ముఖ్యపాత్ర అని కొనియాడారు. రాజకీయంగా గుర్తింపు దక్కినా, దక్కకున్నా క్రమ శిక్షణ తప్పకుండా తమ పాత్ర పోషిస్తారన్నారు.
మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అన్నా తనకు ఎంతో అభిమానమన్నారు. ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్‌పర్సన్ కల్వసు జాత మాట్లాడుతూ.. వాసవీ మాత జయంతి, ఆత్మార్పణ దినోత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రిని కోరానన్నారు. వాసవీ మహాశక్తి మహోత్సవానికి సహకారం అందించినందుకు కృత జ్ఞతలు తెలిపారు. వైశ్యుల సంక్షేమానికి తమ కార్పొరేషన్ పక్షా న కృషి చేస్తున్నట్టు తెలిపారు.
వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు బెల్ది శ్రీధర్ మాట్లాడుతూ.. ఆర్యవైశ్యులం తా ఒక్కతా టిపైకి వచ్చిన ఈ సన్నివేశం అద్భుతమ న్నారు. ప్రముఖ కవి చింతల శ్రీనివాస్ రచించి స్వరకర్త శ్రీ జోశ్యభట్ల స్వరపరిచిన వాసవీ మాత పారాయణాన్ని గాయని కల్పన పాడ గా ఆర్యవైశ్యులు సామూహికంగా పారాయణం చేశారు. ఇది ప్రపంచ రికార్డు సాధించిందన్నారు.
ఏపీ ఐటీ శాఖ మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ.. తెలంగాణలో ఆర్యవైశ్యులకు ఒక మంత్రి పద వి ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరుతానని తెలిపారు. కార్యక్రమంలో కర్ణాటక ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాం ప్రసాద్, రాష్ట్ర ఆర్యవైశ్య ప్రముఖులు ఎమ్మె ల్సీ బొగ్గారపు దయానంద్, కోలేటి దామోదర్‌గుప్తా, ఉప్ప ల శ్రీనివాస్‌గుప్తా, ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా, మాజీ సీఎం బిగాల గణేష్‌గుప్తా, చీకోటి ప్రవీణ్, మలిపెద్ది శంకర్, రాజమౌళి, కేసీపీ అనిల్బె కౌటికె విఠల్, రావికంటి శ్రీనివాస్ పాల్గొన్నారు.




