15-02-2026 12:32:33 AM
గత 28 ఏళ్లుగా అందజేస్తున్న టీటీడీ
వేములవాడ, ఫిబ్రవరి 14,(విజయక్రాంతి): మహాశివరాత్రి సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయం భీమేశ్వర స్వామి వారికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున పట్టు వస్త్రాలను సమర్పించారు. టీటీడీ డిప్యూటీ ఈఓ లోకనాథం ఆధ్వర్యంలో అధికారులు ఆలయానికి చేరుకొని స్వామివారికి శనివారం పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ అధికారులు ఆలయానికి రాగానే దేవస్థాన సిబ్బంది పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించా రు.అనంతరం మీడియా సెంటర్ వద్ద డిప్యూటీ ఈఓ లోకనాథం మాట్లాడుతూ, టీటీడీ తరఫున వేములవాడ దేవస్థానానికి గత 28ఏళ్లుగా పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ రమాదేవి, అర్చకులు,దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు.