16 June, 2026 | 5:11 PM

వర్షం కోసం వరుణ దేవుడికి ఆదివాసుల పూజలు

16-06-2026 03:51 PM

* గజ్జల దేవుడి వద్ద  వర్షం రావాలని ప్రత్యేక పూజలు

* గజ్జల దేవుడికి ఖరీఫ్ పంటల సాగు విత్తనాల సమర్పణ

 ఉట్నూర్,(విజయక్రాంతి): వానకాలం ప్రారంభమైన  వర్షాలు రాకపోవడంతో ఆదివాసి గోండులు  వరుణ దేవుడికి  ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉట్నూర్ ఏజెన్సీలోని  వివిధ గ్రామాలకు చెందిన ఆదివాసీ గిరిజనులు  గ్రామానికి దూరంగా అడవి ప్రాంతంలోకి వెళ్లి  గజ్జల దేవుడికి ప్రత్యేక పూజలు చేస్తూ.. వర్షాలు కురవాలని.. పంటలు బాగా పండాలని  దేవుడిని మొక్కుకుంటున్నారు. గజ్జల దేవుడు.. వరుణ దేవుడికి  ఖరీఫ్ సీజన్లో  పంట చేనులో సాగు చేసే  విత్తనాలను సమర్పించి మొక్కుకుంటున్నారు. మంగళవారం ఇంద్రవెల్లి మండలంలోని  వాల్గొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలోని  అడవి ప్రాంతంలో కొలువుదీరిన  గజ్జల దేవుడికి.. వాన దేవుడికి  ప్రత్యేక పూజలు నిర్వహించారు. అడివిలో  ప్రత్యేకంగా నైవేద్యం చేసి మోదుగు ఇతర ఆకులలో దేవతలకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో లచ్చు పటేల్,  కినక జూగాదిరావు తోపాటు  గ్రామస్తులు పాల్గొన్నారు.