16 June, 2026 | 6:04 PM

ఘనంగా సామూహిక అక్షరాభ్యాసం

16-06-2026 04:53 PM

ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాగజ్‌నగర్ మండలంలోని గిరిజన సంక్షేమ శాఖ ప్రాథమిక పాఠశాల రేగుల్ గూడాలో ఏసీఎంఓ పూర్కా ఉద్దవ్ ఆధ్వర్యంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఆచార్య జయశంకర్ బడి బాట  కార్యక్రమంలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో చేర్పించడం సంతోషకరమని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన ఆంగ్ల మాధ్యమ విద్యతో పాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, సన్నబియ్యంతో భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయులు భావి భారత పౌరులను తీర్చిదిద్దే బాధ్యతతో పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌సీఆర్‌పీ రాథోడ్ రవీందర్, సర్పంచ్ వడాయి సుశీల, ఉపసర్పంచ్ సోయం లచ్చు, గ్రామ పటేల్ సోయం సుంగు, వార్డు సభ్యుడు భీంరావ్, ఉపాధ్యాయుడు లావుడ్యా శంకర్, గ్రామస్తులు అర్జున్, రాజు, నర్సింగరావు, లక్ష్మణ్, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.