16 June, 2026 | 5:10 PM

పాఠ్యపుస్తకాల పంపిణీ

16-06-2026 03:47 PM

బోథ్,(విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళవారం పాఠ్య పుస్తకాల ను అందించారు. ప్రభుత్వ పరంగా సరఫరా అయిన పాఠ్యపుస్తకాలను పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ చేతుల మీదుగా ఉపాధ్యాయుల సమక్షంలో అందించారు. విద్యార్థులు లక్ష్యంతో చదవాలని ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని విద్య కమిటీ చైర్మన్ కోరారు.