సినీనటి అనసూయపై అసభ్యకర పోస్టులు
పోలీసుల అదుపులో నిందితుడు
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): టాలీవుడ్ సినీనటి అనసూయ భరద్వ్పా సోషల్ మీడియాలో అసభ్యకర, పరువు నష్టం కలిగించే కామెంట్లు పోస్ట్ చేసిన కేసులో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు నల్గొండ జిల్లాకు చెందిన యువకు డిని అరెస్ట్ చేశారు. సైబరాబాద్ సైబర్ క్రైమ్స్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ టి. సాయి మనోహర్ తెలిపిన వివరాల ప్రకా రం, నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం అల్వాల గ్రామానికి చెందిన దొరెపల్లి చంటి (30) ఇన్‌స్టాగ్రామ్‌లో @chantidho rapally పేరుతో అకౌంట్ నిర్వహిస్తున్నాడు.
2025 డిసెంబర్ 23 నుంచి పలువురు వ్య క్తులు, సోషల్ మీడియా పేజీలు తనపై అసభ్యకర, అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, దీంతో తన పరువుకు భంగం కలిగిందని అనసూ య ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెం. 81/2026 కింద బీఎన్‌ఎస్ సెక్షన్లు 75, 79, 336(4), 351, 356 మరియు ఐటీ చట్టం 66E, 67 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు డీసీపీ సాయి మనోహర్ తెలిపారు. విచారణలో నిందితుడు చంటి అనసూయను లక్ష్యంగా చేసుకుని అభ్యంతరకర ఎలక్ట్రానిక్ కంటెంట్ను సోషల్ మీడియాలో షేర్ చేసినట్లు తేలడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు.






