4 April, 2026 | 10:34 PM

పేదల జీవితాలలో వెలుగులు నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయం

04-04-2026 08:15 PM

జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్

ఘట్ కేసర్,(విజయక్రాంతి): పేదల జీవితాలలో వెలుగులు నింపడమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పనిచేస్తుందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ అన్నారు. ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని ఘనపురం ఫకీర్ టేక్య తండాలోని ముడావత్ రోజా కిషన్ నూతన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశానికి ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ... ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు.

పేదల కళ్ళలో ఆనందం నింపడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత ఇస్తూ దశలవారిగా ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని, ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఘనపురం మాజీ సర్పంచ్ ననావత్ రూప్ సింగ్ నాయక్, మాజీ ఉప సర్పంచ్  వేముల సత్తయ్య గౌడ్, కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి దేవస్థానం ధర్మకర్త మెరుగు నరేష్ గౌడ్, ఇందిరమ్మ కమిటి సభ్యులు గుర్జకుంట నర్సింహా, ననావత్ శివాజీ నాయక్, మాజీ వార్డు సభ్యులు ననావత్ సురేష్ నాయక్, రామావత్ రాణి, నాయకులు దేవేందర్ ముదిరాజ్, గ్రామస్తులు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.