4 April, 2026 | 10:25 PM

సింగరేణిలో రాజకీయ జోక్యం వల్ల గనుల ప్రారంభం ఆలస్యం

04-04-2026 08:11 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): సింగరేణిలో అధిక రాజకీయ జోక్యం కారణంగా నూతన గనులు ప్రారంభం కావడం లేదని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజకుమార్ అన్నారు. విట్టల్ రావు భవన్‌లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... జెకె-5 ఓసి, కోయగూడెం ఓసి-3 ప్రాజెక్టులను సింగరేణికే అప్పగించాలని డిమాండ్ చేశారు. టెండర్లు పూర్తయినా ఏడాది గడిచినా పనులు ప్రారంభం కాలేదని విమర్శించారు. మెడికల్ బోర్డు పునరుద్ధరించి డిపెండెంట్లకు ఉద్యోగాలు ఇవ్వాలని, ఇల్లు నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు అందించాలని కోరారు.