3 June, 2026 | 12:29 PM

తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే

03-06-2026 11:46 AM

హైదరాబాద్: తెలంగాణ కథలో నంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయే(Congress party) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో అన్నారు. ప్రతి కథలో నాయకుడు, ప్రతి నాయకుడు ఉంటారని తెలిపారు. తెలంగాణ కథలోనూ శకుని, మారీచుడు వంటి పాత్రలు ఉన్నాయని తెలిపారు. ప్రతి వ్యక్తి తాను పుట్టిన గడ్డ చరిత్ర తెలుసుకుకోవాలని కేటీఆర్ సూచించారు.

1952లో గైర్ ముల్కీ ఉద్యమం జరిగిందని తెలిపారు. ఆనాడు బలవంతంగా ఆంధ్ర, తెలంగాణను కాంగ్రెస్ కలిపిందని చెప్పారు. ఆంధ్ర, తెలంగాణ కలిపేసిన తర్వాతా కొన్నాళ్లకే మళ్లీ ఉద్యమం జరిగిందని పేర్కొన్నారు. 1969 ఉద్యమంలో 379 మంది ప్రాణాలను బలిగొన్నది, తెలంగాణ ఉద్యమాలను కర్కశంగా అణిచివేసిందికాంగ్రెస్ పార్టీయే అన్నారు. కేసీఆర్ పోరాటం, దీక్ష లేకపోతే.. తెలంగాణ సాకారం అయ్యేది కాదన్నారు. ఎత్తిన జెండా దింపితే రాళ్లతో కొట్టి చంపండని చెప్పిన ఏకైక నేత కేసీఆర్.. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో.. అని ధైర్యంగా చెప్పిన ఏకైక నేత అన్నారు. కేసీఆర్ పోరాటం వల్లే, తెలంగాణ వచ్చిందనేది నిర్వివాదాంశమని కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమే తెలంగాణ ఇచ్చినప్పటికీ.. ఇవ్వక తప్పని పరిస్థితి సృష్టించింది కేసీఆర్ అన్నారు. తెలంగాణ వచ్చాక.. ప్రాంతాలుగా విడిపోయినా.. ప్రజలుగా కలిసి ఉండాలని భావించామన్నారు. వలస వచ్చి ఇక్కడ ఉంటున్న వారు కూడా మావారే అని భావించామని కేటీఆర్ వెల్లడించారు.