8 July, 2026 | 8:54 PM

ఘనంగా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు

08-07-2026 08:05 PM

జమ్మికుంట,(విజయక్రాంతి): జమ్మికుంట పట్టణంతో పాటు మండల పరిధిలోని కోరపల్లి గ్రామంలో  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి  77 వ జయంతి వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ చౌరస్తా వద్ద  పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సుంకరి  రమేష్ , కోరపల్లి గ్రామంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పరుశురాం రావు ఆధ్వర్యంలో వైఎస్ఆర్  చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు.