29 May, 2026 | 4:20 AM

ఘనంగా ఎన్‌టీఆర్ జయంతి వేడుకలు

29-05-2026 12:27 AM

ఘట్‌కేసర్, మే 28 (విజయక్రాంతి) : తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద గురువారం ఆ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. మొదట తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. అనంతరం రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. ప్రజలల్లో రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన గొప్ప నాయకుడు ఎన్టీఆర్ అని, తెలుగు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచే ఉంటాడని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మల్కాజిగిరి పార్లమెంట్ అడక్ కమిటీ సభ్యులు వేముల సంజీవగౌడ్, పార్టీ సురేందర్ రెడ్డి, సామల జగన్మోహన్ రెడ్డి, ఉడతల మధుబాబు, వేణుగోపాల్ రావు, నర్సింగరావు, మహేష్ గౌడ్, మడ్డి రాములుగౌడ్, సుభాష్ గౌడ్, బాలాజీ శ్రీనివాసచారి, జనార్ధన్, జేఏసీ చైర్మన్ మారం లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.