ఇప్పుడు తమ్ముడితో తర్వాత అన్నతో..!
‘ఊహలు గుసగుసలాడే’ సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది గ్లామరస్ బ్యూటీ రాశీ ఖన్నా. తొలి సినిమాతోనే తన అందంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. బబ్లీ లుక్‌లో భలే ఉందే ఈ అమ్మాయి అంటూ కుర్రాళ్లంతా రాశీ అందానికి ఫిదా అయ్యారు. తొలి సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ ముద్దుగుమ్మకు వరుస ఆఫర్స్ వరుస కట్టాయి. మిడ్ రేంజ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలతోనూ జత కట్టి ప్రశంసలందుకుంది.
ఎన్టీఆర్ నటించిన ‘జై లవకుశ’ సినిమాలో రాశీ ఖన్నా హీరోయిన్‌గా చేసింది. తెలుగుతోపాటు బాలీవుడ్‌పై కూడా ఫోకస్ పెట్టింది. అక్కడ సినిమాలు, సిరీస్‌లు చేసిన ఈ చిన్నది అటు తమిళ్‌లోనూ ఆఫర్స్ అందుకుంది. ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. ‘తెలుసు కదా’ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలోనూ నటిస్తోంది. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జెట్ స్పీడ్‌తో జరుగుతుంది. ఇదిలావుండగా, మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ‘వాల్తేరు వీరయ్య’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు బాబీతో చిరంజీవి మరో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ల ఎంపికపై ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ సర్కిల్‌లో ఒక ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. రాశీ ఖన్నా ఈ క్రేజీ ప్రాజెక్టులో సెకండ్ హీరోయిన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.
తమ్ముడు (పవన్ కల్యాణ్) సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ అందాల రాశీ.. అన్న (చిరంజీవి) నటించబోయే ‘మెగా 158’ చిత్రంలోనూ ఛాన్స్ కొట్టేయడం యాదృచికమే అయినా ఈ విషయం ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది.




