4 May, 2026 | 3:11 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

డాల్బీ ఫార్మాట్‌లో పెద్ది

15-03-2026 12:00 AM

రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న పాన్-ఇండియా యాక్షన్ డ్రామా ‘పెద్ది’. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీశ్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు, బోమన్ ఇరానీ ముఖ్యపాత్రలను పోషిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ -ప్రొడక్షన్, ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకొంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కానుంది.

రామ్‌చరణ్.. అద్దె ఆటగాడు పాత్రలో కనిపిస్తారన్న వార్త ఈ సినిమాపై అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రేక్ష కులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రంలోని మరో ప్రత్యేకతను మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఈ చిత్రం అత్యాధునిక డాల్బీ సినిమా స్ ఫార్మాట్‌లో కూడా విడుదల కానున్నట్టు వెల్లడిస్తూ టీమ్ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. రామ్‌చరణ్ చేతిలో బ్యాట్ పట్టుకుని, ఇంటెన్స్ లుక్‌తో కనిపిస్తున్న ఆయన క్యారెక్టర్ సినిమాలో పవర్‌ఫుల్ యాక్షన్‌ను సూచిస్తోంది.

ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ భారీ యాక్షన్, ఎమోషన్ కలిగిన సినిమాలో రామ్‌చరణ్ మాస్ రగ్గడ్ అవతార్‌ను డాల్బీ సినిమాస్ ఫార్మాట్‌లో చూడ డం ప్రేక్షకులకు మరింత గొప్ప అనుభూతి అందించనుంది. ఈ చిత్రానికి సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్; సంగీతం: ఏఆర్ రెహమాన్; డీవోపీ: ఆర్ రత్నవేలు; ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా; ఎడిటర్: నవీన్ నూలి.