15 June, 2026 | 7:21 PM

Breaking News

రేపు పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేత   •   అవినీతి పాల్పడిన జెడ్పీ సీనియర్ అసిస్టెంట్‌పై సస్పెన్షన్ వేటు   •   వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •  

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి నోటీసులు

23-02-2026 12:57 AM

కిడ్నాప్ కేసులో కలకలం

అబ్దుల్లాపూర్ మెట్, ఫిబ్రవరి 22( విజయక్రాంతి ):ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో రాజకీయ సెగలు మరో సారి రాజుకున్నాయి. కౌన్సిలర్ నక్క యాదగిరి కిడ్నాప్ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు ప్రశాంత్ రెడ్డిలకు ఇబ్రహీంపట్నం పోలీసులు నోటీసులు జారీ చేయడం స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది. మున్సిపల్ ఎన్నికల చైర్మన్ విషయంలో ఇటీవల కౌన్సిలర్ నక్క యాదగిరి కిడ్నాప్కు గురయ్యారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు. కిడ్నాప్ కేసుకు సంబంధించిన పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లగా, నిందితులు ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఎలిమినేడులోని కిషన్ రెడ్డి నివాసానికి నోటీసులను అంటించారు. అలాగే హైదరా బాద్లోని తిరుమల హిల్స్ నివాసంలో కూడా నోటీసులు అందజేసినట్లు సమాచారం.

నోటీసులు అందిన మూడు రోజుల్లోగా విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని పోలీసులు స్పష్టం చేశారు. నిర్ణీత గడువులోగా స్పందించకపోతే చట్టపరమైన తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. రాజకీయ ఉత్కంఠ..... తండ్రీకొడుకులకు ఒకేసారి పోలీసు నోటీసులు అందడంతో ఇబ్రహీంపట్నం రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ కిడ్నాప్ వెనుక అసలు కారణాలు ఏంటి? దీని వెనుక ఉన్న రాజకీయ కోణాలు ఏమిటనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.