సింగిల్ విండో లో ఎలాంటి అక్రమాలు జరగలేదు
చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్...
సుల్తానాబాద్, మే 18 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (సింగిల్ విండో) లో ఏలాంటి అక్రమాలు జరగలేదని, బిఆర్ఎస్ నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు, సోమవారం సుల్తానాబాద్ పట్టణంలోని సింగిల్ విండో సమావేశ మందిరం లో పాలకవర్గ సభ్యులతో చైర్మన్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బి ఆర్ ఎస్ నాయకులు సురశ్యామ్ తో పాటు పలువురు చేసిన ఆరోపణలో వాస్తవం లేదని అన్నారు.
గత 12 సంవత్సరాలుగా తాను రైతుల సంక్షేమం కోసం, సింగిల్ విండో అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేయడం జరుగుతుందన్నారు, సుల్తానాబాద్ సింగిల్ విండో పారదర్శకంగా నడుస్తుందని, ఎన్నో రాష్ట్రాల నుండి ప్రతినిధులు సుల్తానాబాద్ సింగిల్ విండో కు వచ్చి అభివృద్ధిని చూసి అభినందించడం జరిగిందని అన్నారు, అలాంటి తమపై తప్పుడు ఆరోపణలు చేయటం ఏమిటి అని ప్రశ్నించారు, ఏలాంటి రుజువులు లేకుండా ఆరోపణలు చేయడం పై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు, తనకు సింగిల్ విండో చైర్మన్ ఇవ్వద్దని వారు అనటం సరైనది కాదని చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ మండిపడ్డారు...






