22 May, 2026 | 7:59 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కనీస సౌకర్యాలు లేవు

22-05-2026 06:56 PM

- బిజెపి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి

కొండపాక,(విజయక్రాంతి): కుక్కునూరుపల్లి మండల కేంద్రం కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యను తక్షణమే పరిష్కరించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని శుక్రవారం బిజెపి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డి తాహసిల్దార్ కు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా అనుముల సంపత్ రెడ్డి మాట్లాడుతూ మండల కేంద్రంలోని దాన్యం  కొనుగోలు కేంద్రాలలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి, తరుగు పేరుతో రైతులను మోసం చేసి ఇష్టానుసారంగా కటింగ్ వ్యవస్థను అరికట్టాలి.

రానున్న రుతుపవనాలను దృష్టిలో ఉంచుకొని మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాలలో వేగవంతం చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు కనీసం సదుపాయాలు లేక గన్ని బ్యాగులు లేక ఇబ్బంది పడుతున్నారని, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచి, దాన్యం కొనుగోలు చేసిన రైతులకు వెనువెంటనే అకౌంట్లో డబ్బులు వేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.