శుభ్రత లేదు.. లైసెన్స్ ఉండదు!
- వేములవాడ మున్సిపల్ పరిధిలో నిబంధనలు పాటించన మటన్ షాపు నిర్వాహకులు!
అసంపూర్తిగా స్లాటర్ హౌస్ నిర్మాణం
వేములవాడ, ఫిబ్రవరి 24 (విజయక్రాం తి): రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మటన్ షాపుల నిర్వహణపై ప్రజల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ నిబంధనలు, ఆహార భద్రతా ప్రమాణాలు అమలు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.వేములవాడలో మటన్ షాపుల నిర్వ హణపై కఠిన చర్యలు తీసుకోవడం, పూర్తిస్థా యి కబేలా నిర్మాణాన్ని వేగవంతం చేయడం కాలానుగుణ అవసరంగా మారింది. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండానే కొంతమంది వ్యాపారులు మాంసం విక్రయం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ పరిధిలో మటన్ షాపు నిర్వహించాలంటే సంబంధిత మున్సిపాలిటీ నుంచి ట్రేడ్ లైసెన్స్ తప్పనిసరి. కానీ కొందరు అనుమతి లేకుండా నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దుకా ణం పారిశుద్ధ్యం, మురుగునీటి పారుదల, వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలను పరిశీలించిన తర్వాతే లైసెన్స్ జారీ చేయాలి.
అదనంగా, ఆహార భద్రతా ప్రమాణాల ప్రకారం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ తప్ప నిసరి. లైసెన్స్ నంబర్‌ను దుకాణంలో స్పష్టం గా ప్రదర్శించాలి. జంతువుల వధ అనుమతిప్రాప్తకబేలా (స్లాటర్ హౌస్)లో వెటర్నరీ వైద్యుల పర్యవేక్షణలో జరగాల్సి ఉంటుంది. ధృవీకరించని మాంసం విక్రయం చేయడం చట్టవిరుద్ధం.
మున్సిపల్ శాఖ బాధ్యత
మటన్ షాపులపై క్రమం తప్పకుండా తనిఖీలు నిర్వహించడం, లైసెన్స్ లేని దుకాణాల ను గుర్తించడం, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు విధించడం మున్సిపల్ అధికారుల బాధ్యత. ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత కూడా వారి పైనే ఉంటుంది. అయితే పట్టణంలో పర్యవేక్షణ వ్యవస్థకు శ్రీకారం చుట్టి పూర్తి స్థాయిలో అమలు చేయాలనే అభిప్రా యం వ్యక్తమవుతోంది.
పరిశుభ్రత లేమితో సమస్యలు
పరిశుభ్రత లేని వాతావరణంలో విక్రయిం చే మాంసం వల్ల ఫుడ్ పాయిజనింగ్, టైఫాయి డ్, కలరా, జాండిస్ వంటి వ్యాధులు వ్యాపిం చే ప్రమాదం ఉంది. సాల్మొనెల్లా, ఈకోలై వం టి బాక్టీరియా ద్వారా పేగు సం బంధిత ఇన్ఫెక్షన్లు సంభవించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు ఎక్కువగా ప్రభావితమవుతారు.
ఆగిపోయిన కబేలా నిర్మాణం..
వేములవాడ పట్టణంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం హయాంలో బహుళ అవసరాల మార్కెట్ సముదాయం నిర్మాణానికి శ్రీకా రం చుట్టారు. ఇందులో వెజ్, నాన్ వెజ్ మార్కెట్ విభాగాలతో పాటు కబేలా నిర్మా ణం కూడా ప్రతిపాదించారు. అయితే నిధుల లభ్యత లేక పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. ప్రస్తుతం నిర్మాణం అసం పూర్ణంగా ఉండటంతో వ్యాపారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ పాలకవర్గం ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొర వ తీసుకొని స్లాటర్ హౌస్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
అసంపూర్తి నిర్మాణంలో ఉన్న స్లాటర్ హౌస్ పూర్తయ్యేవరకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. మటన్ షాపు నిర్వాహకులందరూ తప్పకుండా నిబంధలను పాటించాలి. నిబంధనలు పాటించకంటే చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం.
కస్తూరి సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ
ఆరోగ్యంగా ఉన్న జంతువులనే వధించాలి
ప్రజలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన మటన్ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో స్లాటర్ హౌస్ నిర్మాణం చేపట్టారు. మేకలు, గొర్రెలు, పొట్టేళ్లను వధించడానికి ఒక రోజు ముందుగానీ లేదా అదేరోజు ఉదయం గానీ వాటి ఆరోగ్య పరిస్థితిని వెటర్నరీ వైద్యులు పూర్తిగా పరిశీలిస్తారు. ఆరోగ్యంగా ఉన్న జంతువులకు మాత్రమే ప్రత్యేక గుర్తింపు (మార్కింగ్) వేయబడుతుంది. ఆ తరువాతే స్లాటర్ హౌస్‌లో వధించేందుకు అనుమతి ఇస్తాం. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తాం.
డాక్టర్ ఆముదం అభిలాష్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్




