ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించిన నిర్మల
సంగారెడ్డి, మే 6 : సంగారెడ్డి, కంది మండలాల్లో బుధవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పర్యటించారు. సంగారెడ్డి మండలం కుల్పగూరు గ్రామంలో పిఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ రైతులు ప్రైవేటు మిల్లర్ల వద్ద వడ్లు అమ్మ కూడదని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యం అమ్మాలని రైతులకు విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ లక్ష్మా రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చిద్రుప్ప రఘు, బలరాం, బుచ్చిరాం లు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బేగంపేట గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ గృహ ప్రవేశంలో నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. బిఆర్‌ఎస్ పార్టీ కి చెందిన గ్రామ కార్యకర్త ఎల్లా గౌడ్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు కాగా గృహం నిర్మాణం పూర్తయింది. ఎల్లా గౌడ్ ఇంటి గృహ ప్రవేశానికి నిర్మల జగ్గారెడ్డి ముఖ్య అతిథిగా హాజరవడం విశేషం. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిదృప్ప రఘు గౌడ్, మహేష్ గౌడ్ లు పాల్గొన్నారు.






