2 July, 2026 | 3:22 PM

Breaking News

యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •   గ్రామ గ్రామాన ఇల్లు నిర్మించిన ఘనత ప్రజాపాలనదే: ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి   •   మాది రైతు ప్రభుత్వం: నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి   •   కల్వకుంట్ల కవిత అరెస్టుపై మండిపడ్డ చెరుకుపల్లి శైలజ   •   గీతం విద్యార్థులకు పిలుపు   •  

నిర్మల్ కవికి సత్కారం

08-05-2026 12:00 AM

నిర్మల్ మే 7 ( విజయ క్రాంతి): భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న 99 రోజుల సాంస్కృతిక కళారూ పాల ప్రదర్శనలు భాగంగా తేదీ 6. 5. 20 26 బుధవారం నాడు రవీంద్ర భారతిలో కవి సమ్మేళనం ఏర్పాటు చేశారు. కవిత గానంలో మొదటి కవిగా నిర్మల్ కు చెందిన సీనియర్ కవి రచయిత మునిమడుగుల రాజారావుకు అవకాశం దక్కింది.

ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా శ్రీమతి ఏ వాణి ప్రసాద్ ఐఏఎస్ గారు, తెలంగాణ ప్రభుత్వం యువజన అభ్యుదయ పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి హాజరైనారు,ఈ కార్యక్రమంలో వారి చేతుల మీదుగా రాజారావు సన్మానం పొందారు.

మునిమడుగుల రాజారావు భారతీయ జీవిత బీమా సంస్థ నిర్మల్ శాఖలో పరిపాలన అధికారి హోదాలో విధులు నిర్వహిస్తున్నారు.వీరు కవిత్వం తాత్విక వ్యాసాల కు సంబంధించిన పలు పుస్తకాలు వెలువరించారు.గతంలో ఎన్నో పురస్కారాలు సొంతం చేసుకున్నారు.పా సొసైటీని స్థాపిం చి గత కొన్నేళ్లుగా తాత్విక చర్చలు నిర్వహించారు.