13 April, 2026 | 11:48 AM

Breaking News

మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో ఘోర రోడ్డుప్రమాదం: ట్రక్కు ఢీకొని ఏడుగురు దుర్మరణం   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •   మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు   •   రెడ్డిపల్లి కార్బన్ రిసోర్సస్ సంస్థ వివాదం – హైకోర్టు ఆదేశాలు, అధికారుల అడ్డంకులు   •  

తొమ్మిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్..

04-10-2025 06:48 PM

ఆరు సెల్ ఫోన్లు, బైక్, నగదు స్వాధీనం..

మణుగూరు (విజయక్రాంతి): పేకాట ఆడుతున్న తొమ్మిది మంది యువకులను అరెస్టు చేసినట్లు సీఐ పాటీ నాగబాబు తెలిపారు. మున్సిపాలిటీలోని ఆదర్శ్ నగర్ లో పేకాట ఆడుతున్నారనే పక్క సమాచారం మేరకు శనివారం పేకాట స్థావరంపై దాడి చేయగా తొమ్మిది మంది వ్యక్తులను అరెస్టు చేసినట్లు సీఐ పేర్కొన్నారు. వారి వద్ద నుండి రూ.8,030 నగదు, బైక్, ఆరు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్.ఐ సిహెచ్. నాగేష్, పోలీస్  సిబ్బంది పాల్గొన్నారు.