13 April, 2026 | 12:22 PM

Breaking News

దశాబ్దాల నిరీక్షణకు ముగింపు— మహిళా రిజర్వేషన్ల చట్టంపై ప్రధాని మోదీ   •   వివాహ వేడుకలో తీవ్రవిషాదం— బస్సు, ట్రక్కు ఢీ: ఆరుగురు మృతి   •   మండల ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించండి   •   నోయిడా కార్మికుల నిరసన హింసాత్మకం... వాహనాలకు నిప్పు   •   గ్రామీణ వైద్యులకు షోకాజ్ నోటీసులు జారీ   •   నెట్‌వర్కింగ్ మార్కెటింగ్ ఒత్తిడి: యువకుడి ఆత్మహత్య   •   బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు; కార్మికులు చిక్కుకున్నట్లు అనుమానం?   •   గుజరాత్‌లో భయానక ప్రమాదం! యాత్రికులపైకి ట్రక్కు దూసుకెళ్లి 7 మృతి – అసలు ఏమైంది?   •   కొల్కూర్ గ్రామంలో తొలిసారి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహణ   •   ఇంటర్ ఫలితాల్లో రిషి విద్యార్థుల ర్యాంకుల పంట   •  

మంత్రి తుమ్మలను కలిసిన మున్సిపల్ వైస్ చైర్మన్, కౌన్సిలర్లు

13-04-2026 10:35 AM

దమ్మపేట,(విజయక్రాంతి): మండల పరిధిలోని గండుగులపల్లి గ్రామంలో సోమవారం ఉదయం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) క్యాంపు కార్యాలయంలో అశ్వరావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ, అశ్వరావుపేటకు కొత్తగా ఎన్నికైన మునిసిపల్ కౌన్సిలర్లు మునిసిపల్ వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ నాయకత్వంలో మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారిని సన్మానించారు.

స్థానిక శాసనసభ్యుడితో కలిసి మంత్రి తుమ్మల వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ తో పాటు కౌన్సిలర్లతో సమావేశం నిర్వహించారు. అశ్వరావుపేట పట్టణం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని, ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అశ్వరావుపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, తెలంగాణ సరిహద్దు ప్రాంతంగా అశ్వరావుపేట ఉండటంతో ఈ పట్టణానికి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసి ప్రజల మన్నలను పొందాలని మంత్రి తుమ్మల సూచించారు. ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.