25 May, 2026 | 5:02 PM

బోధన్ ప్రజావాణిలో 9 దరఖాస్తులు వచ్చాయి

25-05-2026 04:09 PM

బోధన్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం పొందవచ్చునని. ఏకైక సంకల్పంతో ప్రజలు తమ సమస్యని అర్జీ పెట్టుకుంటారు. బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రోజున ఉదయం 10:00 నుండి మధ్యానం 2:00 వరకు జరిగిన “డివిజనల్ ప్రజాపాలన” కార్యక్రమంలో పరిపాలన అధికారి  పి. వెంకటేష్ అన్ని శాఖల డివిజనల్ స్థాయి అధికారులతో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపట్టారు. 

భూ సమస్యలు, ఎండాకాలం కావడంతో నీటి ఎద్దడి పైన నీటి పైప్ లైన్ సమస్య, రిటైర్డ్ ఉద్యోగి తాలూక వేతనాల సమస్య, డబుల్ బెడ్రూంలు సమస్య, విద్యాశాఖ లో ఒక విద్యార్థి అడ్మిషన్ సమస్య, వయో వృద్ధుల పెన్షన్ సమస్య వరకు కలిపి, 9 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.