25 May, 2026 | 4:56 PM

పీఆర్టీయు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్టీయులో చేరిక

25-05-2026 04:06 PM

నిర్మల్,(విజయ క్రాంతి): సోన్ మండలంలోని పాక్ పట్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయులు ఎం. చంద్రశేఖర రావు పీఆర్టీయుటిఎస్ (PRTUTS) రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, STUTS సభ్యత్వాన్ని రాష్ట్ర అధ్యక్షులు జి. సదానంద గౌడ్ మరియు ప్రధాన కార్యదర్శి జుట్టు గజేందర్ చేతుల మీదుగా సభ్యత్వాన్ని స్వీకరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో, జిల్లాస్థాయిలో  ఎస్టీయు ఉపాధ్యాయ సమస్యల సాధనలో చురుకుగా పాల్గొనడం, ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించడంలో ముందుండడం, విద్యారంగా అభివృద్ధికి ఎస్టియు చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఎస్టియులో చేరినట్లు చెప్పారు. ఎస్టియు సంఘ అభివృద్ధికి తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్టీయూ నిర్మల్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు.