ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి
జిల్లా కలెక్టర్ కె. హరిత
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అందుతున్న ఫిర్యాదులపై వెనివెంటనే స్పందించి త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణుతో కలిసి ఆమె అర్జీదారుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.
భూ సమస్యలు, ఇందిరమ్మ ఇల్లు, పింఛన్లు, ఉపాధి హామీ పథకం ఉద్యోగం, ఆర్థిక సహాయం తదితర అంశాలపై ప్రజలు దరఖాస్తులు సమర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి, సంబంధిత శాఖల సమన్వయంతో త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.






