22 August, 2026 | 9:30 AM

తుంగతుర్తిలో కార్డెన్ సెర్చ్

22-08-2026 09:02 AM

నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు.

ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్సు, ఇన్సూరెన్స్, హెల్మెంట్ తప్పనిసరి

తుంగతుర్తి( విజయక్రాంతి): పోలీస్ కమ్యూనిటీ లో భాగంగా తుంగతుర్తి మండల కేంద్రంలోని తూర్పు బజార్, బీసీ కాలనీ ఎస్సీ కాలనీలో కార్డెన్ సెర్చ్ చేసి 74 టు వీలర్లు, 2 ఆటోలు సీజ్ చేసినట్లు సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ ప్రతి వాహన దారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్ ,హెల్మెట్లు తప్పనిసరిగా కలిగి ఉండాలని కోరారు.

సమాజంలో యువత డ్రగ్స్, గంజాయి వైపు మొగ్గుచూపుతున్నారని, వీరి పట్ల ప్రజల అప్రమత్తంగా ఉండాలని, వీటి నిర్మూలన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని అన్నారు. ప్రజలు ఎల్లవేళలా పోలీసులతో మమేకమై మీ సహకారం అందించాలని కోరారు. వాహనదారులు మీ యొక్క ఒరిజినల్ పత్రాలను చూపెట్టి, పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చిన వాహనాలను, తిరిగి తీసుకు వెళ్ళవచ్చు అని తెలిపారు. సరైన పత్రాలు లేని వాహనాలపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఎస్ఐలు క్రాంతి కుమార్, 40 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.