calender_icon.png 10 February, 2026 | 8:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హక్కులను కాలరాసేందుకే నూతన కార్మిక చట్టాలు

10-02-2026 06:36:53 PM

మాజీ చీఫ్ విప్, బిఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రంలోని బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో అన్ని కార్మిక సంఘాలతో కలిసి ఉద్యోగ, కార్మిక హక్కుల సాధనలో భాగంగా, జాతీయ సార్వత్రిక సమ్మె సన్నాహాక సమావేశాన్ని మంగళవారం దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ... కేంద్ర కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనంగా ఫిబ్రవరి 11న వేయిస్తంభాల దేవాలయం నుంచి కాజీపేట రైల్వే స్టేషన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించినట్లు తెలిపారు.

ఫిబ్రవరి 12న గురువారం జరిగే జాతీయ సార్వత్రిక కార్మికుల సమ్మెలో అన్ని సంఘాలు కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని కేంద్రన్నీ డిమాండ్ చేశారు. పనికి తగ్గ వేతనం, సెలవులు, నిరసన తెలిపే హక్కులు ప్రశ్నార్ధకంగా మారుతున్నాయని అన్నారు. మేనేజ్మెంటు పరిశ్రమలలో పనిచేసే ఉద్యోగిని ఐరన్ ఫైర్ విధానంలో తీసుకునే అవకాశం ఉండాలని తెలిపారు.

కార్మికులు సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కులు, సాధనలు ఉద్యమిస్తే వారిని తొలగించే ప్రమాదంలో ఉద్యోగులు ఉంటారని, ఈఎస్ఐ, పీఎఫ్ వంటి కనీస సౌకర్యాలు పొందే లేని పరిస్థితి భవిష్యత్తులో రాబోతుంది. ఈ నూతన కార్మిక చట్టాల ద్వారా వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం అన్ని సంఘాలు ఏకమై కేంద్రంపై పోరాడదాం అని పిలుపునిచ్చారు. రైతు ఉద్యమమే స్ఫూర్తిగా కార్మికులందరూ ఉద్యమించాలని తెలిపారు. 4 నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని, 29 పాత కార్మిక చట్టాలను పునరుద్దించాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో పాల్గొన్న బిఆర్టియు హనుమకొండ జిల్లా కన్వీనర్ నాయిని రవి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగల రమేష్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు సారంగపాణి, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు రాజేందర్, ఏఐసిపియు జిల్లా అధ్యక్షులు ఎన్. శ్రీనివాసరావు, ఎంఏటియు అధ్యక్షులు సంజీవ, శ్రీధర్ రెడ్డి, అధ్యక్షులు ఎం.డి ఇస్మాయిల్, టీబీఎన్ఆర్కే పి. శివకుమార్, బిక్షపతి, రాజు, డిడబ్ల్యుఎంసీ నాయకులు బిక్షపతి, ధర్మరాజు, ప్రతాపరుద్ర ఆటో యూనియన్ నర్సింగ్, హోటల్ యూనియన్ అధ్యక్షులు రఘుబాబు, కార్మిక నాయకులు, నారాయణగిరి రాజు, పలు సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, నాయకులు,కార్మికులు పాల్గొన్నారు.