తహశీల్దార్ కార్యాలయంలో ఉద్యోగుల ఇష్టారాజ్యం
ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల అవినీతిపై చర్యలు లేవా..?
మల్కాజిగిరి, ఆగస్టు 21, (విజయ క్రాంతి): మల్కాజిగిరి తహశీల్ధారు కార్యాలయంలో ఔట్ సో ర్సింగ్ ఉద్యోగుల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇటీవల తాహశీల్ధార్ తో పాటు పలువురు ఉద్యోగులను, సిబ్బందిని బదిలీ చేసినప్పటకీ మండల కార్యాలయంలో కింది స్ధాయి సిబ్బంది పని తీరు ఏ మాత్రం మారడం లేదని వీరీ అవినీతిపై బహిరంగ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక్కడ పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, తహశీల్దార్ ఆదేశాలను సైతం పట్టించుకోకుండా తమకు నచ్చినట్లుగా విధులు నిర్వహిస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. వీరికి కొందరు అధికారులు సంపూర్ణ మద్దతు ఇస్తూ వీరి అవినీతిని మరింత ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందులో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ఇష్టారాజ్యంగా వ్యవహరి స్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా..? ఉన్నతాధికారులు పట్టించుకోక పోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది.
ఆదాయం, కులం, నివాసం, ఇన్ కం వంటి అనేక సర్టిఫికెట్లు జారీ చేయాల్సిన సంబంధిత అధికారులు కాలయాపన చేయడంతో విద్యార్థులు, నిరుద్యోగులు తహసిల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం సర్టిఫికెట్ల జారీకి ప్రత్యేకంగా ఆన్లైన్ విధానం ప్రవేశపెట్టినప్పటికీ, క్షేత్రస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించడంతో జారీలో ఆలస్యం జరుగుతోంది. కాలయాపన జరుగుతుందని ఆందోళన చెందిన దరఖాస్తుదారులు తమ సర్టిఫికెట్ల కోసం తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. తహసిల్దార్ కార్యాలయంలో ముఖ్యంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తీరుతో విద్యార్థులు, నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మ
మల్కాజిగిరి తహసిల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ వాళ్లది పెత్తనం మరింత పెరిగింది. ఎవరైనా క్యాస్ట్, ఇన్ కమ్ సర్టిఫికెట్ కోసం వస్తే వాళ్లను బయట నుండి బయటనే పంపిస్తున్నారు. క్యాస్ట్, ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం 20రోజులు, 30రోజులుగా తిరుగుతున్న బాధితులు.. ఎమ్మార్వో కు ఫిర్యాదు చేద్దామంటే బయట నుండి మమ్మల్ని పంపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా జిల్లా కలెక్టర్ మనుచౌదరి స్పందించి, మండల తహశీల్ధార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయాలని, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనితీరు, ఇక్కడ జరుగుతున్న కాలయాపనను గుర్తించి సర్టిపికెట్ల జారీని వేగవంతం చేయాలని దరఖాస్తు దారులు కోరుతున్నారు.






