కొత్త పాఠ్య ప్రణాళిక!
- ఐఐటీ హైదరాబాద్‌తో సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం ఒప్పందం
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి సమక్షంలో ఎంవోయూ
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, డీఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జీ సతీష్‌రెడ్డి సమక్షంలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) హైదరాబాద్, ములుగు జిల్లాలోని సమ్మక్క -సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం(ఎస్‌ఎస్‌సీటీయూ) మధ్య శుక్రవారం అవగాహన ఒప్పందం కుదిరింది. ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి, ఎస్‌ఎస్‌సీటీయూ వైస్‌చాన్సులర్ ప్రొఫెసర్ వైఎల్ శ్రీ నివాస్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ద్వారా జాతీయ విద్యా విధానాని(ఎన్‌ఈపీ)కి అనుగుణంగా కొత్త పాఠ్య ప్రణాళికలను రూపొందించనున్నారు. అలా గే అధ్యాపకులకు శిక్షణ, మార్గదర్శకత్వం అందించి సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించనున్నారు. ఎస్‌ఎస్‌సీటీయూలో పరిశో ధనలను ప్రోత్సహించేందుకు ప్రయోగశాల, మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడంతోపాటు ఇంటర్న్‌షిపులు, వర్క్‌షా పులు, నిపుణుల ఉపన్యాసాలు నిర్వహించి విద్యార్థులు, అధ్యాపకుల నైపుణ్యాలను మెరుగుపరచనున్నారు.
అదనంగా ఎస్‌ఎస్‌సీటీయూ అధ్యాపకులకు ఐఐటీ హైదరా బాద్ ప్రత్యేక శిక్షణ అందించనుంది. బోధనలో మెళకువలు పెంపొందించేందుకు కార్యశాలలు, సెమినార్లు, అతిథి ఉపన్యాసాలను నిర్వహిస్తారు. 2026--27 విద్యా సంవ త్సరం నుంచి ఎస్‌ఎస్‌సీటీయూలో సాంకేతిక కోర్సుల నిర్వహణకు ఐఐటీ హైదరా బాద్ సహకారం అందిస్తుంది.
ఈ క్రమంలో కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో బీటెక్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూ టింగ్‌లో బీఎస్, కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా అనలిటిక్స్‌లో బీఎస్ వంటి కోర్సులు ప్రారంభించనున్నారు. ఈ కోర్సులను బో ధించే ఎస్‌ఎస్‌సీటీయూ అధ్యాపకులకు శిక్షణ బాధ్యతను ఐఐటీ హైదరాబాద్ చేపడుతుంది. ఐఐటీ హైదరాబాద్ మార్గదర్శక త్వంలో నిర్వహించే అడ్వానస్డ్ టెక్నాలజీ కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు, ముఖ్యం గా తెలంగాణ విద్యార్థులకు ప్రయోజనం కలగనుంది.
రాష్ట్రానికి సేతుబంధన్ 103 కోట్లు
- రెండు ప్రాజెక్టులకు కేంద్రం ఆమోదం
- కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం
హైదరాబాద్, ఏప్రిల్ 10 (విజయక్రాంతి): రోడ్డు రవాణా, రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు కేంద్ర ప్రభు త్వం ప్రాధాన్యత ఇస్తూ.. కేటాయింపులు చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. గత 11 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి తోడ్పా టు అందిస్తోందని గుర్తుచేశారు. తాజా గా ‘సేతుబంధన్’ పథకం కింద రూ.103 కోట్ల విలువైన ప్రాజెక్టులకు కేంద్ర రోడ్డు, రవాణా శాఖ ఆమోదం తెలపడం పట్ల హర్షం వ్యక్తంచేశారు.
దీంతో ప్రధాని మోదీకి, కేంద్రమంత్రులు నితిన్‌గడ్కరీకి, అశ్విని వైష్ణవ్‌కు ధన్యవాదాలు తెలిపా రు. ‘సేతుబంధన్’లో భాగంగా సెంట్రల్ రోడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (సీఆర్‌ఎఫ్) కింద రూ.103 కోట్ల పనులకు ఆమోదం తెలిపింది. నల్గొండ జిల్లాలో నార్కట్ పల్లి- రైల్వే లైన్‌లోని రైల్వే ఓవర్ బ్రిడ్జికి రూ.69 కోట్లు, ఖమ్మం జిల్లా మధిరలోని రైల్వేలైన్ దగ్గర అండ ర్ పాస్, ఎఫ్‌ఓబీతో పాటు అప్రోచ్ రోడ్ల కు రూ.34కోట్లు ఖర్చు చేయనుంది.




