13 March, 2026 | 1:31 PM

ఇరాన్‌ కొత్త సుప్రీం లీడర్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్

13-03-2026 12:30 PM

మొజ్తాబా ఖమేనీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కీలుబొమ్మ

జెరూసలేం: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీకి(Iran Supreme Leader Mojtaba Khameneiఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు వార్నింగ్ ఇచ్చారు. ముజ్తాబా ఖమేనీని కూడా విడిచిపెట్టమని ఇజ్రాయెల్‌ ప్రధాని(Israeli Prime Minister) హెచ్చరించారు. ముజ్తాబా ఖమేనీ ఉగ్రవాద పోషకుడని నెతన్యాహు(Netanyahu) ఆరోపించారు. ఖమేనిలాగే ముజ్తాబాను కూడా లక్ష్యంగా చేసుకోవచ్చన్నారు. ఉగ్రసంస్థల నేతల జీవితాలకు తాను భరోసా ఇవ్వనని నెతన్యాహు స్పష్టం చేశారు.

మొజ్తాబా ఖమేనీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్(Iran Revolutionary Guard) కీలుబొమ్మ అన్నారు. ఇరాన్ తో తాము చేస్తున్న యుద్ధంలో దాడులు సక్సెస్‌ అయ్యాయని పేర్కొన్నారు. ఇరాన్‌లో నియంతృత్వ పాలనను అంతమొందించడమే తమ లక్ష్యమని నెతన్యాహు ప్రకటించారు. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా సంక్షోభం తీవ్రమవుతోంది. అటు ఇరాన్ నూతన నాయకుడు మొజ్తబా ఖమేనీ, ఒక వైమానిక దాడిలో తీవ్రంగా గాయపడ్డారని విశ్వసనీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆయన ప్రస్తుతం కోమాలో ఉన్నారని, ఒక కాలును కోల్పోయారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.