రోడ్డు నిర్మాణ పనుల్లో అలసత్వం
బీఆర్‌ఎస్ యూత్ నాయకులు వినూత్న నిరసన
వెంటనే పూర్తి చేయాలని డిమాండ్
భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక సుభాష్ కాలనీలో రోడ్డు నిర్మాణ పనుల ఆలస్యంపై బీఆర్ఎస్ యూత్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూత్ ప్రధాన కార్యదర్శి మహేందర్ యాదవ్ ఆధ్వర్యంలో రోడ్డు మధ్యలో నిలిచిన వర్షపు నీటిలో చేపలు పడుతూ వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోడ్డు నిర్మాణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వర్షపు నీరు గుంతల్లో నిలిచి చెరువులను తలపిస్తున్నాయని, వాహనదారులు, కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి నిలిచిపోయిన రోడ్డు నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో 16వ వార్డు కౌన్సిలర్ మంజుల వెంకటేశ్వర్లు మాజీ కౌన్సిలర్ ముంజంపల్లి మురళీధర్ వార్డు అధ్యక్షులు మోహన చారి, కంచు రాజేందర్, గట్టయ్య, రాయమల్లు, పృథ్వీ, తిరుపతి, నరసింహ చారి, బ్రహ్మారెడ్డి, శోభన్ బాబు, యూత్ నాయకులు, జోరు రాజ్ కుమార్, అంగోతు తిరుపతి, గసిగంటి కుమార్, బానోతు మహేష్, ఆదిత్య బన్ని, మేకల రాజు ఆకాష్, బీఆర్ఎస్వి నాయకులు కొల్లోజు దిలీప్ కుమార్ కాలనీవాసులు పాల్గొన్నారు.






