8 August, 2026 | 5:33 PM

Breaking News

పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •   ఫారం పండు పనులతో భూగర్భ జలాలు పెంపు.   •   నో పార్కింగ్‌ బోర్డులు.. అయినా అదే తీరు!   •   క్విట్‌ ఇండియా స్ఫూర్తితో కార్మిక కోడుల రద్దు వరకు ఉద్యమిద్దాం   •  

పాఠశాలలో సందర్శించిన డిఇఓ

08-08-2026 03:49 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థుల ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా సామర్థ్యాలు (Foundational Literacy and Numeracy – FLN) మెరుగుపరిచే లక్ష్యంతో FLN సెల్ ఆధ్వర్యంలో GPS- సాయి నగర్  (UM&TM)పాఠశాలల సందర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న పరిశీలించారు.

 విద్యార్థుల చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం, ప్రాథమిక గణిత నైపుణ్యాలు మరియు తరగతి స్థాయి అభ్యసన సామర్థ్యాలను పరిశీలించింది. విద్యార్థుల అభ్యసన స్థాయిని ప్రత్యక్షంగా పరిశీలించి, అవసరమైన విద్యార్థులకు అదనపు అభ్యసన సహాయం అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  అకాడమిక్  మానిటరింగ్ అధికారి నరసయ్య, ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ ఖలీద్, సుమలత, సిఆర్పి ఫిరోజ్ పాల్గొన్నారు.