దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి
తూప్రాన్,(విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ కేంద్రంలో దేవి హాస్పిటల్ లో ఆందోళనకు దిగిన భాదితులు. వివరాలు ఇలా ఉన్నాయి. కొకొండ గ్రామంలోని మైత్రీ అనే యువతి గర్భం కన్ఫర్మ్ కావడంతో ముందు నుండి ప్రతినెల దేవి హాస్పిటల్ లో గర్భవతికి కావలసిన వైద్యం చేయించుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా నెలలు నిండి మైత్రికి పురిటి నొప్పుల రావడంతో దేవి హాస్పిటల్ తీసుకు రావడం జరిగింది. వైద్యం చేసే క్రమంలో నొప్పులు వచ్చే సమయం లో నొప్పులు రాకుండా వైద్యులు సూదులు ఇచ్చారని మైత్రి తల్లి ఆరోపించింది.
అనంతరం వేరే హాస్పిటల్ కు తీసుకు వెళ్ళండని వారు చెప్పడంతో బాధితులకు అనుమానం వచ్చి ఎందుకు తీసుకు వెళ్ళమని అంటున్నారని నిలదీశారు. వారు ఏమి సమాధానం చెప్పక పోవడంతో వారు గజ్వేల్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకు వెళ్లి చూపించడంతో అప్పటికే కడుపులో బాబు మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మైత్రి తండ్రీ నర్సింలు తల్లి కుటుంబ సభ్యులుతిరిగి దేవి హాస్పిటల్ కు వచ్చి ఆందోళనకు దిగి మాకు న్యాయం చేయాలని నిరసన తెలియచేసారు.




