1 April, 2026 | 1:25 PM

Breaking News

ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు.. ఏదో ఒక జీవో అడ్డంకి   •   దేశవ్యాప్తంగా అమల్లోకి కొత్త ఐటీ చట్టం.. రూ. 4 లక్షల వరకే పన్ను మినహాయింపు   •   దేవి హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యం.. కడుపులోనే పసికందు మృతి   •   రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్   •   ఎల్‌పీజీ కొరతపై ఆటో డ్రైవర్ల ఆందోళన... సాగర్ హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం   •   పౌల్ట్రీ కంపెనీల ధోరణిని నిరసిస్తూ చికెన్ షాపుల బంద్   •   గ్యాస్ కోసం క్షణక్షణం నిరీక్షణ   •   బాధిత కుటుంబాలకు హరీష్ రావు పరామర్శ   •   ఆకాశాన్నంటిన విమాన ఇంధనం ధరలు.. ప్రయాణికులపై ఛార్జీల మోత   •   యువనటిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్   •  

రాజేంద్రనగర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్... రూ. 100 కోట్ల విలువైన స్థలం సేఫ్

01-04-2026 11:39 AM

హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్‌ మండలం(Rajendra Nagarమైలార్‌దేవ్‌పల్లి లో బుధవారం తెల్లవారుజామున హైడ్రా భారీ ఆపరేషన్ చేపట్టింది. రూ. 100 కోట్ల విలువైన 188 ఎకరాల క్రీడా మైదానం స్థలాన్ని కాపాడింది. శాస్త్రిపురంలోని హుడా లేఅవుట్ స్థలంలో అక్రమ నిర్మాణాలను హైడ్రా(Hydra Demolitions) అధికారులు నేలమట్టం చేశారు. క్రీడా మైదానానికి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. నిర్మాణ దశలో ఉన్న జీ ప్లస్ 3 అంతస్తుల 5 భవనాలను హైడ్రా తొలగించింది.

కబ్జాదారులు ఈ స్థలంలో మూడేళ్లుగా నోటరీ చేసి విక్రయిస్తున్నారు. క్రీడా మైదానం స్థలంలో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. జీహెచ్ఎంసీ(Greater Hyderabad Municipal Corporation) గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. స్థానికుల ఫిర్యాదుతో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చితలు చేపట్టారు. స్థానిక నివాసులు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, పార్కు కోసం ఉద్దేశించిన ఆ భూమిని పరిరక్షించినందుకు హైడ్రాను అభినందించారు.