17 March, 2026 | 6:56 PM

ఎన్డీఆర్ఎఫ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం

17-03-2026 05:35 PM

నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో వాసవి వరల్డ్ పాఠశాలలో పాఠశాల భద్రతపై ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రమాదాల నివారణ తదితరు అంశాలపై అవగాహన కల్పించారు. ప్రత్యేకంగా, హార్ట్ అటాక్ వంటి అత్యవసర పరిస్థితుల్లో CPR (Cardio Pulmonary Resuscitation) విధానం ఎలా చేయాలి, గాయపడిన వారికి ప్రథమ చికిత్స (First Aid) ఎలా అందించాలి అనే విషయాలను NDRF సిబ్బంది ప్రాక్టికల్ డెమోస్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సెక్రటరీ జగదీష్ రెడ్డి గారు, కరెస్పాండంట్ పోత రెడ్డి గారు, ప్రిన్సిపాల్ శైల జాయ్ సన్, ఇన్స్పెక్టర్ మన్మోహన్ యాదవ్ గారు, SFO డి. శివాజీ గారు అగ్నిమాపక సిబ్బంది మరియు NDRF బృందం, పూధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు