6 August, 2026 | 4:24 AM

ఘనంగా 40వ నవోదయ వ్యవస్థాపక దినోత్సవం

06-08-2026 12:04 AM

గజ్వేల్, ఆగస్టు 5  (విజయక్రాంతి) : సిద్దిపేట జిల్లా వర్గల్ జవహర్ నవోదయ విద్యాలయంలో నవోదయ విద్యాలయ సమితి 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. ప్రిన్సిపల్ ఇన్చార్జి మోహన్ రాథోర్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నవోదయ విద్యాలయాల లక్ష్యాలు, విశిష్టతపై ఉపాధ్యాయులు, విద్యార్థులు ప్రసంగించారు. 8వ తరగతి విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. అనంతరం ఉపాధ్యాయులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు.

పదవీ విరమణ పొందిన తెలుగు అధ్యాపకుడు శంకరమంచి శ్యాంప్రసాద్ మార్గదర్శక ఉపన్యాసం ఇవ్వగా, పూర్వ విద్యార్థి డాక్టర్ సాయినాథ్ రెడ్డి నవోదయ విద్య తన విజయానికి పునాదిగా నిలిచిందని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు.