6 August, 2026 | 3:25 AM

23 నుంచి ఆటోడ్రైవర్ల సమ్మె

06-08-2026 12:03 AM

ముషీరాబాద్, ఆగస్టు 5 (విజయక్రాంతి): రాష్ట్రంలోని ఆటో, క్యాబ్, లారీ, బస్సు డ్రైవర్ల కోసం ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించింది. బుధవారం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో బీఆర్టీయూ ఆటో యూనియన్ అధ్యక్షుడు వీ మారయ్య అధ్యక్షత వహించగా, వివిధ యూనియన్ల నేతలు పాల్గొన్నారు.