24 April, 2026 | 5:32 PM

నాగిరెడ్డిపేట్లో ఘనంగా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు

24-04-2026 04:04 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూర్,మాసానిపల్లి, మార్టూరు,జలాల్పూర్, ఆత్మకూర్,బొల్లారం, గోపాల్పేట్,నాగిరెడ్డిపేట, మాల్తుమ్మెద,వదలపర్తి, చినూర్,వాడి తదితర గ్రామాల్లో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచులు మాట్లాడుతూ...జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడానికి గల కారణాన్ని అదేవిధంగా 73వ రాజ్యాంగ సవరణ చట్టం,దాని ప్రాముఖ్యత వలన కలిగే ప్రయోజనాలు, గ్రామసభ, రిజర్వేషన్లు, ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి పంచాయతీ ఎన్నికలు,రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాటు, రాష్ట్ర ఆర్థిక సంఘం ఏర్పాటు, రిజర్వేషన్లు, పంచాయతీ నిర్మాణం ఎన్నికలు, మూడంచేల వ్యవస్థ, మొదలైన వాటి గురించి మరియు 73వ రాజ్యాంగ సవరణ చట్టం వల్ల కలిగిన ఇతర అధికార గురించి చర్చించడం జరిగింది. అదేవిధంగా స్వచ్ఛత శపథం ప్రతిజ్ఞ చేయడం జరిగింది. అలాగే పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు సందర్భంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డ్ మెంబర్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్తులు పాల్గొన్నారు.