20 August, 2026 | 3:30 AM

ఉత్సాహంగా నాసర్ స్కూల్ స్పోర్ట్స్ మీట్

20-08-2026 01:02 AM

హైదరాబాద్, ఆగస్టు 19: గచ్చిబౌలి నాసర్ బాయ్స్ స్కూల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. ఈ క్రీడా సంబరాన్ని సైబరాబాద్ కమిషనరేట్ పోలీసు కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ వేడుకల్లోనే కొత్తగా ఎన్నికైన విద్యార్థి ఆఫీస్ బేరర్లకు వారి సంబంధిత బాధ్యతలను అప్పగించారు. ఈ వేడుక నాయకత్వం, క్రమశిక్షణ, బాధ్యత, పాఠశాల సమాజానికి సేవ పట్ల విద్యార్థుల నిబద్ధతను గుర్తు చేస్తూ సాగింది.

ఈ కార్యక్రమంలో నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ నవాబ్ మీర్ ఖుతుబుద్దీన్ ఖాన్, డైరెక్టర్ల బోర్డు సభ్యురాలు బేగం సల్వా ఖాన్, నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ డైరెక్టర్ అకాడమిక్స్, నాసర్ స్కూల్ ప్రిన్సిపాల్ మీర్ మొహియుద్దీన్, ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మీర్ జమాలుద్దీన్ హమ్మద్, నాసర్ ఎడ్యుకేషన్ సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, నస్ బాయ్స్ స్కూల్ ప్రిన్సిపాల్ మీర్ హఫీజుద్దీన్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల యొక్క అత్యుత్తమ ఐసిఎస్‌ఇ మ రియు ఐఎస్సి టాపర్లను సత్కరించారు, వారి అసాధారణమైన విద్యా విజయాలకు గుర్తింపుగా బంగారు పతకాలు, మెరిట్ అవార్డు లను అందజేశారు.